![]() |
![]() |
.webp)
కొత్త రోజు.. మరో కొత్త ట్రెండ్.. కొత్త విజువల్స్. ఇన్ స్టాగ్రామ్ లో మన సెలెబ్రిటీలు కొత్త ట్రెండింగ్ ని ఫాలో అవుతున్నారు. అదే.. " మెంటల్లీ ఐ ఆమ్ హియర్. వేర్ ఆర్ యూ ".. సెలెబ్రిటీలు వారి లైవ్ వీడియోకి ఈ టెక్స్ట్ ఆడ్ చేసి చెప్తున్నారు. నిన్న మొన్నటి దాకా కుర్చీ మడతబెట్టి అయింది. ఇప్పుడేమో ఇది.
అనసూయ భరద్వాజ్.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఏదో ఒక కంటెంట్ తో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటు బుల్లితెరపై యాంకర్ గా అటు సినిమాల్లో నటిగా చేస్తూ తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. అనసూయ ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉండటంతో ఇన్ స్ట్రాగ్రామ్ లో అత్యధికంగా 1.4 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉంది. ఎప్పుడు హాట్ ఫోటోలతో మత్తెక్కించే ఈ 'రంగమత్త' ని.. ఎవరో ఒక నెటిజన్ ఆంటీ అన్నారని తెగ ఫీల్ అయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో మరో రచ్చ అయింది. ఓ రెసార్ట్ లో ఫ్యామిలీతో కలిసి కొన్ని బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇప్పుడేమో సమ్మర్ మొదలైందంటు చెరుకురసంతో కూడిన గ్లాస్ ని పోస్ట్ చేసింది. దాని తర్వాత నేను మెంటల్లీ ఇక్కడ ఉన్నాను. నువ్వెక్కడున్నావ్ అనే ట్రెండింగ్ ని ఫాలో అవుతూ తను ఉన్న ప్లేస్ ని చూపిస్తూ వీడియోని షేర్ చేసింది అనసూయ. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రంగస్థలం' సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండేవారి లిస్ట్ ఒకటి తీస్తే.. టాప్-10 లో అనసూయ ఉంటుంది. అంతలా ఫాలోవర్స్ ని కలిగి ఉన్న అనసూయ ప్రస్తుతం ట్రెండింగ్ ని ఫాలో అవుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
![]() |
![]() |